శ్రీవిద్యా సాధన ఫౌండేషన్ కోర్సు I - మోదటి దశ
ఈ దశ లో మీరు ఈ క్రింద తెలిపిన విషయాలు నేర్చుకుంటారు
- శ్రీ లలితా త్రిపుర సుందరి లఘు నిత్య పూజ
- మహా గణపతి మంత్ర దీక్ష
- ప్రతికూల ప్రారబ్ద కర్మలను తగ్గించడానికి శక్తివంతమైన గణపతి పూజ
- శ్రీ చక్ర ఆరాధన
ఈ సాధన యొక్క ముఖ్య లక్ష్యం: మీలోని భయం, ఆందోళన, అభద్రతాభావాలు మరియు సందేహాలను అదిగమించటం.
ఈ దశ లో సాధన మీ భౌతిక మరియు ఆధ్యాత్మిక పురోగతికి అవరోధంగా మారే ప్రారబ్ద కర్మల నుండి ఉపశమనాన్ని కలిగించి, మీ పురోగతికి సహాయం చేస్తుంది.
గణపతి క్రమం ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేస్తుంది, అభ్యాసకులకు లోతైన స్థిరత్వం మరియు శాంతిని సమకూరుస్తుంది. ఇది మనల్ని తరచుగా కలవరపెడుతున్న అంతర్లీన భయాలు, ఆందోళనలు, అభద్రత మరియు సందేహాలను శాంతింపజేస్తుంది.
మూలాధార చక్రానికి అధిష్ఠాన దేవత మహాగణపతి. మహాగణపతి మూలాధారం లో అడ్డంకులను తొలగించడంలో సహాయం చేస్తూ మీకు మార్గనిర్దేశం చేస్తారు. మీలోని కుండలినీ శక్తి మహాగణపతి అనుగ్రహం ద్వార మాత్రమే మేల్కొంటుంది.
కోర్సు వ్యవధి:
- రెండు రోజుల సమగ్ర శిక్షణ (ప్రతి రోజు మూడున్నర గంటలు)
- మంత్ర దీక్ష (మంత్ర దీక్ష వ్యక్తిగతంగా ఇవ్వబడుతుంది. దీక్షా సమయం తరువాత మీకు తెలియచేస్తాము)
- మీ సందేహాలను నివృత్తి చేయడానికి మేము తదుపరి సెషన్‌లను నిర్వహిస్తాము
రోజువారీ అభ్యాస సమయానికి సంబంధించి వివరాలు:
- మీరు కనీసం 45 రోజుల పాటు ప్రతిరోజూ ఒక గంట ఈ అభ్యాసానికి కేటాయించాలి.
- గమనిక: మహిళలు ఋతుక్రమం అనుగుణంగా విరామం తీసుకోవచ్చు.
అర్హత:
- ముందస్తు ఆధ్యాత్మిక అనుభవం అవసరం లేదు.
- శ్రీవిద్యా సాధన నేర్పుకోవటానికి లో జాతి, కుల, లింగ విభేధాల ఆధారంగా అర్హత నిర్ణయించరు.
- ఈ దశలో ఆహార అలవాట్లులో మార్పులు అవసరం లేదు.