శ్రీవిద్యా సాధన శ్యామ క్రమం - మూడవ దశ
ఈ దశ సాధన లో ప్రేమ మరియు కరుణ రసం అభివృద్ధి చెందుతాయి (హృదయం స్థానం). అంతర్ద్రుష్టి (ఇంట్యూషన్) మొదలైన మానసిక సామర్ధ్యాలు కూడా పెంపొందుతాయి.
- రాజ శ్యామలా మంత్ర దీక్ష
- శ్యామా ఆవరణార్చన
- శ్రీగురు దత్తాత్రేయ మంత్ర దీక్ష
- కుండలిని మరియు షట్ చక్రాల (అడ్వాన్స్) సాధన
- ముద్రలు & న్యాసాలలో (అడ్వాన్స్) సాధన
- ధ్యాన సాధన ప్రారంభం
రాజశ్యామలా దేవి సాధన ప్రధానంగా అనాహత చక్రం (హృదయ చక్రం)పై దృష్టి పెడుతుంది. నిగూఢ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు మరియు అంతర్ దృష్టిని మెరుగుపరచడానికి మార్గనిర్దేశం చేస్తుంది.
భౌతిక విషయాలలో, రాజ శ్యామలా దేవి అధికార, రాజ్యాధికార ప్రాప్తి కలిగిస్తుంది. అమ్మవారు రహస్యజ్ఞానం మరియు మంత్రజ్ఞానం అనుగ్రహించి ప్రాపంచిక విజయాన్ని మరియు ఆధ్యాత్మిక లోతును సులభతరం చేసి సుసంపన్నమైన జీవితం వైపు నడిపిస్తుంది.
కోర్సు వ్యవధి:
- రెండు రోజుల సమగ్ర శిక్షణ (ప్రతి రోజు మూడున్నర గంటలు)
- మంత్ర దీక్ష (మంత్ర దీక్ష వ్యక్తిగతంగా ఇవ్వబడుతుంది. దీక్షా సమయం తరువాత మీకు తెలియచేస్తాము)
- మీ సందేహాలను నివృత్తి చేయడానికి మేము తదుపరి సెషన్‌లను నిర్వహిస్తాము
రోజువారీ అభ్యాస సమయానికి సంబంధించి వివరాలు:
- మీరు కనీసం 45 రోజుల పాటు ప్రతిరోజూ ఒక గంట ఈ అభ్యాసానికి కేటాయించాలి.
- గమనిక: మహిళలు ఋతుక్రమం అనుగుణంగా విరామం తీసుకోవచ్చు.
అర్హత:
- మీరు ఫౌండేషన్ కోర్సును – II పూర్తి చేసి ఉండాలి.
- ఈ దశలో మీరు మీ సమయాన్ని చాలా సమర్ధవంతంగా నిర్వహించగలుగుతారు. మీలోని బలహీనతలను తొలగించే దిశగా మీరు కృషిచేయాలి.