శ్రీవిద్యా సాధన వారాహి క్రమం - నాల్గవ దశ

Vaarahi - Srividya - Mahavidya Sadhana

లక్ష్యం: ఈ దశలోఆధ్యాత్మిక సాధన వేగవంతం అవుతుంది. వ్యక్తిగత పరిమితులను అధిగమించి మానసికంగా శక్తివంతం అవుతారు. తద్వారా ఆత్మసాక్షాత్కార మార్గం సులభమౌతుంది.

  • వారాహి మంత్ర దీక్ష
  • వారాహి ఆవరణార్చన
  • శివ మంత్ర దీక్ష
  • కుండలిని మరియు షట్ చక్ర (అడ్వాన్స్సాధన
  • ధ్యాన సాధన (అడ్వాన్స్

శ్రీవిద్యా సాధనలో వారాహి దేవి నిగూడమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. అమ్మవారు ఉగ్ర రూపం కలిగి వుంటారు. అమ్మవారు అజ్ఞానంతో పోరాడి సాధకులను జ్ఞానోదయం వైపు నడిపించే ఆధ్యాత్మిక యోధురాలిగా గౌరవించబడుతోంది. సాధకులలో భ్రమ, అహంకారాన్ని తగ్గించి, వారి నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది.

వారాహి అమ్మవారు మనలో పూర్తి పరివర్తనను తీసుకువచ్చి రక్షణ కల్పించి ఆధ్యాత్మిక ప్రయాణంలో స్థిరత్వం మరియు స్థైర్యాని అందిస్తుందివారాహి దేవి మనలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీసి సాధకులని ఆత్మ జ్ఞానం వైపు నడిపిస్తారు.

కోర్సు వ్యవధి:

  • రెండు రోజుల సమగ్ర శిక్షణ (ప్రతి రోజు మూడున్నర గంటలు)
  • మంత్ర దీక్ష  (మంత్ర దీక్ష వ్యక్తిగతంగా ఇవ్వబడుతుంది. దీక్షా సమయం తరువాత మీకు తెలియచేస్తాము)
  • మీ సందేహాలను నివృత్తి చేయడానికి మేము తదుపరి సెషన్‌లను నిర్వహిస్తాము

రోజువారీ అభ్యాస సమయానికి సంబంధించి వివరాలు:

  • మీరు కనీసం 45 రోజుల పాటు ప్రతిరోజూ ఒక గంట ఈ అభ్యాసానికి కేటాయించాలి.
  • గమనిక: మహిళలు  ఋతుక్రమం అనుగుణంగా విరామం తీసుకోవచ్చు.

అర్హత:

  • రాజ శ్యామల సాధన పూర్తి చేసి ఉండాలి.
  • ఈ దశలో మీ మానసిక సామర్థ్యాలు పెరిగేకొద్దీ మీ మనస్సుపై నియంత్రణ సాదించటం ముక్యం. మీకు కావలసిని సహకారి మేము అందిస్తాము.
Scroll to Top