Sri Lalitha Tripura Sundari Sri Vidya Sadhana

శ్రీ మాత్రే నమః

మహావిద్యా సాధన ఆధ్యాత్మిక కేంద్రానికి స్వాగతం.

సాంప్రదాయ ఆధ్యాత్మిక సాధనలను నేర్చుకోండి

ఆగమ శాస్త్రానుసారంగా శ్రీవిద్య, దశ మహావిద్య మరియు కుండలినీ సాధన రహస్యాలను నేర్చుకోండి.

* శ్రీవిద్య

* దశ మహావిద్య

* కుండలినీ సాధన

శ్రీవిద్యా సాధన పరిచయం

* ఇంగ్లీష్ లో: 11 మే 2024 తేదీ సాయంత్రం 6:30 నుండి 7:15 వరకు.

శ్రీవిద్యా సాధన ఫౌండేషన్ కోర్సు (గణపతి క్రమం Level 1 )

* తెలుగు లో: మే 04 మరియు 05 సాయంత్రం 5:30 గంటల నుండి రాత్రి 8:00 వరకు.

సంపూర్ణ శ్రీవిద్యా సాధన

  • శ్రీగురు దత్తాత్రేయ పరంపరలో ‘పరశురామ కల్ప సూత్రం’లో వివరించిన క్రమ పద్ధతి అనుసరించి శ్రీవిద్యా సాధన నేర్చుకోవడంలో 5 దశలు ఉన్నాయి.
  • శ్రీవిద్య సాధన కోర్సు లో మీరు సంప్రదాయం ప్రకారంమంత్ర దీక్ష, యంత్ర పూజ, దేవతా తర్పణాలు, ధ్యానము మరియు ముద్రలు నేర్చుకుంటారు.
  • మీరు 35 సంవత్సరాల ఆధ్యాత్మిక సాధన అనుభవం ఉన్న గురువు నుండి నేరుగా నేర్చుకుంటారు.
  • ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో, మిమ్మల్ని మీరు సంపూర్ణంగా మార్చుకొని జగన్మాత శ్రీ లలిత త్రిపురసుందరి కృపకు పాత్రులు అవుతారు.
Srividya Teacher Dattatreya Parampara Guru Sri Chaitanya
శ్రీవిద్యా గురు

శ్రీ చైతన్య

శ్రీవిద్యా గురువు శ్రీ చైతన్య గారు 36 సం గా ఆధ్యాత్మిక తపస్సు లో వున్నారు. చిన్నవయసు నుండి వారు అనేక ఆధ్యాత్మిక సాధనలో సిద్ది పొందారు.

గురూజీ మార్గదర్శకత్వంతో మీ ఆధ్యాత్మిక సాధనను వేగవంతం చేసుకొండి.

“మీ కర్మలు పరిపక్వమైనప్పుడే ఆ జగన్మాత శ్రీవిద్యా రహస్యాలను తెలుసుకునే అవకాశాన్ని ఇస్తుంది. శ్రీవిద్య ఆత్మవిద్య. ఈ ఇహపరసాధన. మీ భౌతిక జీవితానికి అర్థాన్ని కల్పించి మీమల్ని ఆధ్యాత్మికవైపు నడిపిస్తోంది.” ~ శ్రీవిద్యా గురువు శ్రీ చైతన్య.

Siva - Srividya Sadhana - Mahavidya Sadhana Centre

ఆది గురువు పరమ శివుడు

"ఆగమ సాధన జ్ఞానానికి ప్రధాన మూలం"

శ్రీవిద్య, దశ మహావిద్య, కుండలినీ సాధన మరియు కాశ్మీర్ శైవ సాధనలు ఆగమ శాస్త్రాలలో రహస్య విద్యలుగ  వున్నవి.

ఆగమ శాస్త్రాలలో ఆధ్యాత్మిక రహస్యాలు శివ పార్వతి సంవాదాలుగా మనకు లభ్యమవుతున్నాయి. ఈ సాధనలు ఆత్మ సాక్షాత్కార మార్గాలుగా  ఈ గ్రంథాలలో చర్చించబడ్డాయి. ఈ సాధనలు సాంప్రదాయ గురు-శిష్య పరంపరలో మనవరకు చేరాయి.

ఈ సాధనలు వామాచార, దక్షిణాచార మరియు ఇతర మార్గాలలో ఆచరించబడుతున్నాయి. ఈ సాధనాలన్నీటిలోకి శ్రీవిద్య అత్యంత ప్రచూర్యం పొందింది.

Lalitha Devi - Srividya Sadhana - Mahavidya Sadhana Centre

శ్రీవిద్యా సాధన

శ్రీవిద్యా సాధన ఆత్మసాక్షాత్కారానికి, మోక్షానికి మార్గము.

శ్రీవిద్యా సాధన వల్ల మనిషి జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఆత్మసాక్షాత్కారం కలిగి మోక్షానికి అర్హుడవుతాడు. శ్రీవిద్యా సాధన యొక్క నిగూఢ అభ్యాసాలను గురు దత్తాత్రేయుడు, భగవాన్ పరశురాముడికి బోధించారు. పరశురాముడు ఈ బోధనలను 'పరశురామ కల్పసూత్రం'లో సంకలనం చేసారు.

శ్రీవిద్య ఆత్మ జ్ఞానాన్ని (ఆత్మ సాక్షాత్కారం) సాధించే పరమ మార్గాన్ని సూచిస్తుంది. శ్రీవిద్య మీ జీవితానికి ఒక అర్ధాన్ని తీసుకు వస్తుంది. జగన్మాత శ్రీ లలితా త్రిపురసుందరిని మంత్ర ద్వారా యంత్ర రూపంలో ఉపాసన చేయడమే శ్రీవిద్య. వయస్సు, కులం, మతం, బాష, జాతీయత లేదా ఇతర యే భేదాలు లేకుండా ఎవరైనా జగన్మాత శ్రీ లలితా త్రిపురసుందరిని ఆరాదించవచ్చు. చిత్తశుద్ధితో ఆ జగన్మత్ పైనా పూర్తి విశ్వాసంవుంచి చేయటమే ముక్యం. శ్రీవిద్యా సాధన గురించి పూర్తి అవగాహన కోరకు మేము నిర్వహిస్తున్న ఉచిత “శ్రీవిద్యా సాధన పరిచయం” సెషన్ లో పాల్గోనండి.

Dasha Mahavidya - Srividya - Mahavidya Sadhana

దశ మహావిద్యా సాధన

శ్రీవిద్యా మరియు దశమహావిద్య సాధకులకు కామాఖ్య అత్యంత ప్రాముక్యం కలిగిన క్షేత్రం.

కామాఖ్య ఆలయం అస్సాంలోని గౌహతిలోని నీలాచల కొండలపై ఉంది, ఇక్కడ జగన్మాత కాళి, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా, ధూమావతి, భాగళాముఖి, మాతంగి మరియు కమలాత్మికగా పది విభిన్న రూపాలలో కనిపిస్తుంది.

ప్రధాన కామాఖ్య దేవాలయం గర్భగృహలో, అమ్మవారిని షోడశిగా (కామేశ్వరి లేదా రాజ రాజేశ్వరి అని కూడా పిలుస్తారు) పూజిస్తారు , మాతంగి (రాజా శ్యామల) మరియు కమలాత్మిక ఆమె ప్రక్కన ఉన్నారు.

దశ మహావిద్యలు అనేక కరణాలవల్ల తరతరాలుగా కొన్ని సంప్రదాయ కుటుంబాలలో రహస్యంగా గురు-శిష్య పరంపరలో మౌఖికంగా అందించబడ్డాయి.

దురదృష్టవశాత్తు ఈ దశ మహావిద్యల గురించి సామాన్య ప్రజలలో అనేక అపోహలు ఉన్నాయి. వీటికి కొందరి స్వార్ధం ఇంకోదరరి అత్యుత్సాహం కారణం. ఈ సాధనలు వామాచార, దక్షిణాచార పద్దతుల్లో అనుసరిస్తారు. వామాచార మార్గం అంధరికి అమోదయోగ్యం కాదు. దశమహావిద్యల్ని దక్షిణాచార మార్గంలో ఆచరించి ఆ జగన్మాత పూర్థి అనుగ్రహం పొంద వచ్చు.

Kundalini Sadhana - Srividya - Mahavidya Sadhana

కుండలినీ సాధన

కుండలినీ సాధన మంత్రం, క్రియ, ముద్ర, ఆసనం, ప్రాణాయామం, ధారణ మరియు ధ్యానాలను కలిగి ఉంటుంది.

ఈ కోర్సులో కుండలిని యొక్క అంతుచిక్కని రహస్యాలను అన్వేషించి తెలుసుకొని ఒక క్రమ పద్ధతిలో సాధన చేయటం నేర్చుకుంటాము. కుండలిని గురించి సమగ్ర అవగాహన పొందడానికి అష్టాంగ యోగం (యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన మరియు సమాధి) తోపాటు మనికొన్ని హఠా యోగ, మంత్ర యోగ, నాద యోగ మొదలైన సాధనలు అనుసరించాలి. కుండలినీ సాధనను శ్రీవిద్యా సాధనలో భగంగా నేర్చుకుంటారు.

సమకాలీన కాలంలో, అనేక యోగా స్టూడియోలలో 'కుండలిని యోగ' అని పిలువబడే అభ్యాసం సాంప్రదాయ కుండలిని అభ్యాసానికి చాలా తక్కువ పోలికను కలిగి వున్నాయి.

అధునిక సమకాలిన గురువులు కొందారు కాశ్మీర్ శైవ ఆగమములో ప్రముఖమైన 'విజ్ఞాన భైరవ తంత్రం" లో వున్న కొన్ని సాధనలు తీసుకొని, సొంత సాధనలు కొన్నిటిని జోడించి కొత్త పద్ధతిలో కుండలిని జాగృతి చేస్తామని ప్రచారం చేస్తున్నారు. ఈ సాధనల నుండి దూరాంగవుండటం యెంతో శ్రేయస్కరం.

కుండలినీ సాధనని శ్రీ లలిత రహస్యనామ స్తోత్రం, సౌందర్య లహరి స్తోత్రం, మొదలైన గ్రంథాలలో రహస్యంగా సూచించారు. ఈ సాధనలు చెయ్యడానికి యోగ్యమైన శిష్యులు అనుభవమున్న గురువు ముక్యం. కుండలినిపై వున్న గ్రంథాలు చాలా వరకు ఇంకా ప్రచురించాల్సివుంది (అవి తాళపత్ర గ్రంధాలగానే ఉన్నాయి - మాన్యుస్క్రిప్ట్ రూపంలో ), ఫలితంగా సాంప్రదాయ జ్ఞానంలో గణనీయమైన అంతరం ఏర్పడింది.

ఈ గ్రంథాలు లేకపోవడం వల్ల ఆధునిక ఆధ్యాత్మిక భాష్యకారులు/న్యూ ఏజ్ గురువులు వారి ఊహాకు తోచినట్టు అనేక వ్యాఖ్యానాలు అందిస్తున్నారు. పర్యవసానంగా, 'కుండలిని' తరచుగా వివిధ ఆధ్యాత్మిక పద్ధతులకు సరిపోయేలా మార్చబడుతుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు

ఇవి ప్రత్యేకమైన సాధనలు, అయినప్పటికీ అవి పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. మీ ఆధ్యాత్మిక మార్గం ఈ సాధనలలో దేనితోనైనా ప్రారంభించవచ్చు. మహావిద్య సాధనా కేంద్రంలో మేము శ్రీ విద్యా సాధనతో ప్రారంబిస్తాము. ఉపాసకుల పురోగతిని బట్టి అవసరమైన ఇతర అభ్యాసాలను క్రమంగా నేర్పిస్తము.

నిర్ణీత నిబద్ధత కాలం యేమి లేదు. మీ సాధననుబట్టి గురువు మీ ఉరోగతి గమనించి మీకు మార్గ నిర్దేశం చేస్తారు. 

ఇది పూర్తిగా మీ ప్రాధాన్యతపై ఆధారపడి ఉంటుంది. మీరు రోజుకు 30 నిమిషాలతో ప్రారంభించవచ్చు, ఆపై మీరు మీ జీవితంపై మరింత నియంత్రణను పొందినప్పుడు క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు.

సాధన ప్రతిరోజు చేయాలి. స్త్రీలకు రుతుక్రమం సమయమప్పుడు మినహాయింపు ఉంటుంది. మీరు వారాంతాల్లో ఎక్కువ సమయం కేటాయించగలిగినప్పటికీ, అభ్యాసాన్ని వారాంతాల్లో మాత్రమే చేయడం అంత ప్రభావవంతంగా ఉండదు.

సాధనకు దేవత పట్ల గౌరవం తప్పనిసరి. మీరు మీ సాధనలో పురోగమిస్తున్నప్పుడు ఒక స్థితిలో అద్వైత అనుభూతిని పొందినప్పుడు, బాహ్య పూజ అంతర పూజ గా మారుతుంటారు.

మీరు శాఖాహారులైనా మాంసాహారులైనా ఆహారం సాధనలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పటికి ఇప్పుడు మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు సాధనలో పురోగతి చెందుతున్నప్పుడు, మీ ఆహార అలవాట్లు, భాష, ఆలోచన విధానం, వ్యవహార శైలి, నడవడి అన్నిట్లోను మార్పు వస్తుంది. సాధన మీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమయినప్పుడు అన్నీ విషయాలలో మార్పు వస్తుంది.

శ్రీవిద్య సాధన నేర్చుకోవడానికి మరియు అభ్యాసం చేయడానికి హృదయపూర్వక ఆసక్తి,

సేవలో పాల్గొనడం (నిస్వార్థ సేవ),

వ్యక్తిగత పరివర్తన లో మార్పు,

జీవితంలో నిజాయితీగా ఉండటం (యమ నియమాలు సాధనలో ముఖ్యమైన భాగం).

మీలో వున్న ద్వేషం, కోపం, పగ, అసూయ స్వభావం మొదలైనవాటిని మార్చుకోవాలన్న సంకల్పం,

ప్రకృతిలో ప్రతిదాని పట్ల దయ మరియు కరుణను కలిగి ఉండటం.

అయితే ఇవ్వని మీరు కలిగు ఉంటేనే శ్రీవిద్య మొదలెట్టాలని కాదు, సాధనలో భాగంగా ఇవి మీ లక్షలుగా ఉండాలి.

కోర్సు మరియు దీక్ష జూమ్ వీడియో కాల్ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించబడతాయి. మీ రిజిస్ట్రేషన్ ఫారమ్‌ని సమీక్షించిన తర్వాత మేము జూమ్ లింక్‌ని షేర్ చేస్తాము. మంత్ర దీక్ష  (నేత్ర దీక్ష) వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌లో ఇవ్వబడుతోంది.

శ్రీవిద్య సాధన పరిచయ సెషన్ కోసం యేమి అవసరం వుండవు. కార్యక్రమం మొదలైన తరవాత యేమి కొనాలో చేపుతాము. మేము వీటిని విక్రయించము.

Mahāvidya Sādhana Centre

శ్రీవిద్య సాధన పరిచయ సెషన్‌లో నమోదు చేసుకోండి

Scroll to Top